Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలు

భారత మహిళా క్రికెట్ జట్టు విజయానికిసిఎం రేవంత్ రెడ్డి అభినందనలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికితెలంగాణ ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో విజయం సాధించి, అత్యంత ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు అచంచలమైన ధైర్యం, పట్టుదల, సంకల్పబలం ప్రదర్శించిందని ఆయన ప్రశంసించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వాన్ని, మొత్తం జట్టు చూపిన సమిష్టి కృషి, అత్యుత్తమ ప్రదర్శనను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దాల కల సాకారమైందని, ఈ చారిత్రక విజయానికి దేశమంతా గర్విస్తోందని అన్నారు.క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి, పోరాటస్ఫూర్తి దేశంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భారత జట్టు మరిన్ని విజయాలను సొంతం చేసుకుని, ప్రపంచ క్రీడా రంగంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.Hon’ble Chief Minister  A. Revanth Reddy extended heartfelt congratulations to the Indian women’s cricket team for their spectacular triumph in the ICC Womens World Cup 2025. He lauded the team for their unwavering strength, grit, and determination in securing the coveted title after a thrilling final against South Africa.The Chief Minister also applauded Captain Harmanpreet Kaur for her stellar leadership and the team’s outstanding performance in the finals. He conveyed special congratulations to the entire women’s team as a decades-long dream comes true, stating that the whole nation stands proud of their remarkable achievement. Revanth Reddy remarked that the sportsmanship and fighting spirit displayed by the players have set a shining example for aspiring athletes across the country.  He expressed confidence that the team will continue to scale even greater heights in the future, driven by the same enthusiasm, unity, and confidence that led them to this historic victory.

Related posts

సందడిగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు వీక్షించిన ఎమ్మెల్యేలు,మేయర్, కలెక్టర్

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు

ఎన్ఎస్ఎస్ అడ్వెంచర్ శిబిరానికి వాలంటీర్ల ఎంపిక