(జై భారత్ వాయిస్ న్యూస్ నాయుడుపేట)
నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్ ఏర్పాటుకు ఎన్ ఓసి ఇవ్వాలనీ ఆ కాలనీవాసులు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజుల్లుల్లను కలిసి వినతి పత్రం అందజేశారు.నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, విన్నమాల గిరిజన కాలనీ వద్ద రైల్వే గేటు మరమ్మత్తుల పనులతో రైల్వే అధికారులు స్థానిక దళిత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమీషనర్ కు కాలనీ వాసులు వివరించారు.తమ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. రైల్వే అ ధికారులు సోమవారం అండర్ పాస్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించి NOC కావాలి అని అన్నారు అని తెలియజేశారు. కమిషనర్ స్పందించి ఆరవ తేదీన రైల్వే గేట్లను సందర్శిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తడుకు చందు, జడ వెంకటేష్ , గోవిందు శ్రీనివాస్ కప్పల మునుస్వామి, దారా శేఖర్, కప్పల ముని రాజా, వినోద్ కుమార్, పాల్గొన్నారు.
previous post

