Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు శివాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్)ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచకూట శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి రాత్రి వరకు ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు కామారం తిరుమలగిరి తదితర గ్రామాల ప్రజలు పంచ కూట శివాలయానికి తరలివచ్చి మహా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆకాశదీపం ,జ్వాలాతోరణం ఉత్సవాలను నిర్వహించారు అలాగే శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించే జ్వాలాతోరణం సందర్భంగా భక్తులకు సందర్శించేందుకు అనువుగా వీలు కల్పించారు. జ్వాలా తోరణం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎండిఓ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్ పలకల మంజుల మాజీ జెడ్పిటిసి సత్యనారాయణ మాజీ ఉపసర్పంచి వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, పలు గ్రామాల భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు

Related posts

గవర్నర్ సమావేశంలో పాల్గొన్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్!

ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

Jaibharath News

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వనం