Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలు

జిల్లా స్థాయి  యోగాసన పోటీలు

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట)
వరంగల్ ,హనుమకొండ జిల్లాల  ఆధ్వర్యంలో శనివారం రంగశాయి పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  నిర్వహించిన యోగాసన పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో వరంగల్ జిల్లా నుండి 40 మంది హనుమకొండ జిల్లా నుండి 40 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథులచే మెడల్స్  సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.ఈ యోగాసనం క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులు నవంబర్ 9 ఆదివారం రోజున రంగారెడ్డి జిల్లా నర్సింగి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో  వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, బొలిశెట్టి కమలాకర్,కార్యదర్శి పాకాల కృష్ణవేణి, సహాయ కార్యదర్శి పాకాల రవీందర్, ట్రెజరర్  అడుప. సాంబశివరావు ఈసీ  తీగల శ్రీనివాస్,ఎండి పాషా, రజిత, మానస, విక్రమ్ శ్రీకాంత్, కుమారస్వామి, హనుమకొండ యోగ అసోసియేషన్ అధ్యక్షులు బాల్నే  శ్రీధర్ కార్యదర్శి కుండే స్వప్న, సహాయ కార్యదర్శి కుండే  కిరణ్, ట్రెజరర్ పెరుమాండ్ల కిరణ్, జ్యోతి, మౌనిక,  రాజేందర్  యోగా  కోచ్ లు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Related posts

రాష్ట్ర స్థాయి యోగసన పోటీలకు ఎంజెపి విద్యార్థులు ఎంపిక

ఎన్ఎస్ఎస్ అడ్వెంచర్ శిబిరానికి వాలంటీర్ల ఎంపిక

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు