శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం గొర్రకుంట వంచనగిరి గ్రామాలలో మహిళలు శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు మహిళలు తమ కుటుంబాలకు సౌభాగ్యం కోసము ఆర్థిక అభివృద్ధి కోసం అనారోగ్యము బారిన పడకుండా ఈ వ్రతం చేసుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించామని మహిళలు తెలిపారు వరలక్ష్మి వ్రతం జరుపుకున్న మహిళలు ఇరుగుపొరుగు మహిళలకు వాయినాలు ఇచ్చుకున్నారు
previous post