(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను జాతర ప్రాంగణంలో ఈవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, సిఐ ఆర్ సంతోష్ స్థానిక సర్పంచ్ మహేందర్ జాతర పూజారులు జాతర ప్రాంగణంలో క్యూ లైన్ లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఏర్పాట్లను ప్రారంభించారు. జాతర మాజీ చైర్మన్ బోరిగం స్వామి గ్రామ పార్టీ అధ్యక్షులు ఏలియా గ్రామస్తులు అధికారులకూ తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారికి అనువైన సౌకర్యాలను ఏర్పాట్ల చేయాలని అన్నారు. వాటి కోసం రైతులతో అధికారులు మాట్లాడారు. సమ్మక్క జాతర సమీపిస్తున్నందున అధికారులు అందుబాటులో ఉండి భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేయాలని సమీప గ్రామాల ప్రజలు భక్తులు కోరుతున్నారు.

