Jaibharathvoice.com | Telugu News App In Telangana
సిద్దిపేట జిల్లా

శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ కన్నుమూత

Photo:

శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ కన్నుమూత

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని అహ్మదీపూర్ గ్రామానికి చెందిన శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ (102) గారు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల రాజయ్య తల్లిగారైన ఐలమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, మారిన వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన చలి గాలులతో గత 10 రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం తుది శ్వాస విడిచారు. ఐలమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటల అహ్మదీపూర్ లో జరుగుతాయని కుటుంబీకులు తెలియజేశారు.
కాగా, ఐలమ్మ మరణం పట్ల… BJP కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు డాక్టర్ కోవ లక్ష్మణ్, BJP రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు, BRS రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలుపుతూ ఆకుల రాజయ్యను ఫోన్లో పరామర్శించారు.
హైదరాబాద్ నగరంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి అహ్మదీపూర్ వచ్చిన అన్ని పార్టీల నాయకులు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు, డాక్టర్లు, అడ్వకేట్లు, మున్నూరు కాపు సంఘం నాయకులు… తల్లి గారి మరణంతో శోక సముద్రంలో ఉన్న ఆకుల రాజయ్యను కలిసి, పరామర్శించి, ధైర్యం చెప్పి ఓదార్చారు.

Related posts

కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిదిలో నామినేషన్ పత్రాలకు పూజ చేసిన సీఎం కేసీఆర్