(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )మినీ మేడారం గా వెలుగొందుతున్న అగ్రంపహాడు సమ్మక్క జాతర ఈ నెల లో జరుగుతున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై పరకాల ఏసిపి సతీష్ బాబు ఆత్మకూరు సిఐ సంతోష్ లు పరిశీలించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జాతర ప్రాంగణంలోని పార్కింగ్ స్థలాలు, దర్శన ప్రాంతాలు, కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీసు సిబ్బంది నివాస ఏర్పాట్లు, చెక్ పోస్టులు, బస్‌స్టాండ్‌తో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన చర్యలను అధికారులు పరిశీలించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలు, లక్షలాది మంది జనసందోహ నియంత్రణ, అత్యవసర సేవల అందుబాటు అంశాలపై అధికారులతో చర్చించారు. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని ఏసీపీ అధికారులకు సూచించారు. భక్తులకు శాంతియుత వాతావరణంలో సమ్మక్క సారలమ్మ దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సిఐ సంతోష్ సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

