Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జాతీయ స్థాయికి ఎదిగిన నీరుకుళ్ళ ఖోఖో క్రీడాకారుడు ప్రోత్సాహం అందించాలి

( జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్)
తెలంగాణ రాష్ట్రం తరఫున క్రీడాకారుల జట్టులో ఒక సభ్యుడు మాత్రమే కాకుండా రాష్ట్ర ఖో ఖో టీంకు అతను కెప్టెన్ గా వ్యవహరిస్తూ జాతీయస్థాయి ఖో ఖో ఆటలో రాణిస్తున్నాడు.కఠోర శ్రమ ఉంటేనే
జాతీయ స్థాయిలో రాణించడం సాధ్యమవుతుంది. అతని కుటుంబంలో వెన్ను తట్టి ప్రోత్సహించే వారు లేరు .ఆర్థికంగా పెద్దగా ఉన్న వాడు కూడా కాదు .దేశవ్యాప్తంగా ఎక్కడ ఖో ఖో క్రీడలు జరిగిన జాతీయస్థాయిలో రాకేశ్ పాల్గొంటున్నాడు అతను వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన న్యాతకాని రాకేష్ ఖోఖో ఆటలలో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. రాకేష్ ది వ్యవసాయ కుటుంబం .అతని తండ్రి శంకర్ సాధారణ రైతు కూలీ. రాకేష్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువు తూ క్రీడాకారుడిగా ఎదిగాడు. స్వయం శక్తితో తల్లిదండ్రులతో తోడ్పాటుతో ముందుకు సాగుతున్నాడు. జాతీయస్థాయి కోకో పోటీలు హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే గ్రౌండ్స్ లో ప్రారంభం కానున్నాయి. ఖో ఖో ఆటకు టీమ్ కు కెప్టెన్ వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ తనను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన కోరారు. డిగ్రీ పూర్తి చేశానని తనకు ఉద్యోగం కల్పిస్తే ఆటలో మరింత రాణిస్తానని వివరించారు. అతను చిన్నతనంలో వివిధ ఆటలను చూస్తూ ఖోఖో ఆట మీద మక్కువ పెంచుకున్నానని ఆయన తెలిపారు గ్రామీణ క్రీడాకారులను ప్రతిభను ప్రోత్సహించేందుకు వివిధ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.

Related posts

14 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

ఉద్యోగుల సమస్యల సాధన సభను విజయవంతం చెయ్యండి

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

Jaibharath News