Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అలనాటి మధుర స్మృతులను పంచుకున్నపూర్వవిద్యార్థులు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):- అలనాటి మధుర స్మృతులకోసం మళ్లీ ఒక్కరోజు పంచుకోవడం జరిగిందని విజయవాడ ఆర్ధిక సమత మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ చందా సత్యనారాయణ అన్నారు. ఆత్మకూరు మండలం లోని పెంచికలపేట ZPHS 1975-76 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమావేశం స్థానిక పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ కందకట్ల నరహరి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సత్య నారాయణ మాట్లాడుతూ గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు తమవంతు కృషి చేస్తానని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిచేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. గత 51 సంవత్సరల క్రితం చదివిన పాఠశాలలో కలుసుకోవడం చాలా స తోషంగా ఉందన్నారు…ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బత్తిని అశోక్ గౌడ్,రేవురి నారాయణ రెడ్డి,నరిశెట్టి ప్రవీణ్ కుమార్, గజేందర్ రెడ్డ్, మాధవ రెడ్డి, నిమ్మటూరి ప్రకాశం , బి జె కమలాకర్,
పి బీమారావు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు..

Related posts

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

Jaibharath News

అవయవ దానంతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు

ఎన్నికల హామీలను అమలు చేయాలి