జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: రాష్ట్రంలో అన్ని ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి konda Surekha కొండా సురేఖ అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం kothakonda కొత్తకొండ లోని శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లను దర్శించుకున్నారు.bhadrakali భద్రకాళి నుండి basaraబాసర వరకు ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సబ్ కమిటీని వేయమని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు తెలిపారని అన్నారు. భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణ పనులు, వేములవాడ మాడవీధుల నిర్మాణ పనులు సాగుతున్నాయని చెప్పారు. Sammakka saralamma సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు నభూతో నభవిష్యత్తు అన్న విధంగా ఉన్నాయని అన్నారు. మేడారంలో సమ్మక్క సారక్క గిరిజన జాతర జరగబోతుందన్నారు. Telangana ప్రజలందరికీ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీరభద్ర స్వామి ఆశీస్సులు అందజేస్తూ ముందుకు నడిపించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నట్లు తెలిపారు.
previous post

