Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

క్రీడలలో యువత రాణించాలి ..

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) :
యువత క్రీడలలో రాణించి గ్రామానికి మంచి పేరు తేవాలని ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు.శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో బోగి,సంక్రాంతి,కునుమ సందర్బంగా గ్రామ స్థాయి క్రీడలు నిర్వ హించారు. అనంతరం సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు మాట్లాడుతూ హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రామ స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే రేవూరి ప్రోత్సాహంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. గెలుపొందిన క్రీడా కారులు కుక్కల రమేష్, రజినీకాంత్ ల టీమ్ లను అభినందించి బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు బయ్యా కుమార్, ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన శ్యామ్, కాంగ్రెస్ నాయకులు సుగ్రీవ్, యూత్ నాయకులు వీరేందర్, నవీన్, రోహిత్, మణికంఠ, రజినీకాంత్, కక్కు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు…

Related posts

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

Jaibharath News

స్థానిక సంస్థ ఎన్నికలకు జూబ్లీహిల్స్ గెలుపు రెఫరండం

ఆత్మకూరులో ఘనంగా పెత్ర మాస బతుకమ్మ