Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు

(జై భారత్ వాయిస్ చాట్రాయి)
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలో ఘనంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు స్థానికంగా ఉన్న అంబెద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు ఆర్.సి.యం స్కూల్లో బుక్స్ పెన్నులు పంచి పెట్టినారు, వికలాంగులకు సన్మానించి ఆర్థిక సహాయం, కంటి వైద్య శిబిరం ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు , స్థానిక RCM చర్చిలో స్థానిక ఫాదర్ జయరాజుతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరకు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు, తదుపరి RCM స్కుల్ లోని పిల్లలకు బుక్స్ అందజేశారు కేక్ కటింగ్ చేసి అనంతరం విలేకరులతో బర్మా ఫణి బాబు గారు మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరం లో చుపించున్నా వారికి ఉచితంగా కండ్ల అద్దాలు 👓 ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని, మీ అందరి ఆదరాభిమానాలు జనసేనా పార్టీకి , పవన్ కళ్యాణ్ ఇలాగే ఇవ్వాలని కోరినారు ఈ కార్యక్రమంలో నూజివీడు టౌన్ నాయకులు ముత్యాల కామేష్, చాట్రాయి మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, రాంబాబు, దుర్గాప్రసాద్, కోటేశ్వరరావు, పాశం నాగబాబు, శ్రీకాంత్, అభిరామ్, రామకృష్ణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News