Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతరలో అన్ని శాఖల అధికారులు విస్తృత సేవలందించాలి

సమ్మక్క జాతరలో అన్ని శాఖల అధికారులు విస్తృత సేవలందించాలి

  • వేగవంతంగా పూర్తి చేయండి
  • అన్ని శాఖల అధికారులు సమన్వ పనిచేయాలి
  • పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
    ( జై భారత్ వాయిస్ ఆత్మకూరు).
    మేడారం తర్వాత స్థాయిలో జరుగుతున్న అగ్రంపహాడ్
    సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించా లని వాటిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పర్యటించి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. గత జాతర ల కంటే ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు స్థానాల ఘట్టాలు, మంచినీటి సౌకర్యాలు, భక్తులు విడిది చేసేందుకు కావలసిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పనులు చేయడం పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఎండోమెంట్ ఈవో నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖల అధికారుల నుండి చేసిన అభివృద్ధి పనుల వివరాలను తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 గంటలు అన్ని శాఖల అధికారులు జాతర పూర్తయ్య వరకు ఇక్కడే ఉండి జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్షలాదిమంది వచ్చే భక్తులకు అడుగడుగున సకల సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించాలన్నారు. వరంగల్ నుండి జాతర వరకు మహిళలకు ఫ్రీ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే భక్తుల అందరికీ వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా జాతర వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించాలని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు. ఈనెల 25న మళ్లీ నేను వస్తా జాతర మూడు రోజులు ఇక్కడే ఉండి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తానని ఎమ్మెల్యే అన్నారు. నేను వచ్చే లోపు అన్ని పనులు పూర్తి కావాలని ఎవరు నిర్లక్ష్యం చేసిన సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలిగితే అధికారులదే బాధ్యత వహించాలని కలెక్టర్ హెచ్చరించారు. జాతర పనులు పర్యవేక్షించేందుకు మళ్లీ వస్తానని రెండు రోజుల లోపే అన్ని పనులు పూర్తి కావాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈగలు ఇప్పుడే వస్తున్నాయి వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నిత్యం బ్రిచింగ్ పౌడర్ క్లోరినేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు సంతోషంగా దర్శనం చేసుకునే విధంగా చూడాలన్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాటు చేయవలసిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందన్నారు.

Related posts

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

Jaibharath News

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి నేతలు

Jaibharath News

హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కేటాయించాలి

Jaibharath News