Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ నుండి మేడారానికి హెలికాప్టర్ ప్రయాణ సౌకర్యం

జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ: మేడారం దర్శనానికి వెళ్లే భక్తుల కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో  హెలికాప్టర్ ప్రయాణ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.గురువారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మేడారం భక్తుల కోసం ఏర్పాటుచేసిన హెలికాప్టర్ సేవలను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలో  మేడారం జాతరకు సంబంధించి  హెలికాప్టర్ రైడ్ ప్రారంభించినట్లు తెలిపారు.  హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుండి ఒక హెలికాప్టర్, మేడారంలో మరొక హెలికాప్టర్ ఉంటుందని అన్నారు. మేడారం వెళ్లే భక్తుల కోసం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి మేడారానికి, తిరిగి హనుమకొండ చేరేవరకు ఒక్కరికి రూ. 31వేలు చార్జ్ చేస్తారని అన్నారు. ఐదు నుండి ఏడు నిమిషాల వరకు  జాయ్ రైడ్ కోసం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హెలికాప్టర్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, సూర్య కిరణ్, సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ఇతర అధికారులు జాయ్ రైడ్ చేశారు

.మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సర్వీస్..ములుగు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 2026 మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు హెలికాప్టర్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మేడారం జాతర సందర్భంగా ఈ నెల 31 వరకు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి మేడారం వరకు, VIP దర్శనం తర్వాత మేడారం నుంచి హనుమకొండ వరకు ప్రయాణ సౌకర్యం.టికెట్ ధరలు: ఒకరికి ₹35,999 (రౌండ్ ట్రిప్).జాయ్‌రైడ్: మేడారం జాతరను ఆకాశం నుంచి 6-7 నిమిషాలు వీక్షించడానికి ఒకరికి ₹4,800.స్పెషల్ ఆఫర్: జనవరి 23 వరకు బుకింగ్ చేస్తే ₹30,999; 24 తేదీ నుంచి ₹35,999.కొత్తగా రూపొందించిన మేడారం టెంపుల్ సౌకర్యార్థం ఒక హెలికాప్టర్ రౌండ్ ట్రిప్‌కు, రెండవది జాయ్‌రైడ్‌కు ఏర్పాటు. గత 10 సంవత్సరాలుగా సేవలందిస్తున్న థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది.బుకింగ్ వివరాలు:
ఫోన్: 9676320139, 8530004309, 7660939509వెబ్‌సైట్: www.helitaxii.com సంప్రదించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ తెలిపారు.

Related posts

ఆగష్టు 31 వరకు అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు! జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి