(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన కీర్తి శేషులు పెరుమాండ్ల కనుకయ్య, వీరమ్మ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారుడు. గ్రామ శ్రేయోభిలాషి పెరుమాండ్ల మదన్ మోహన్, ప్రభావతి దంపతులు, అతని కుమారుడు పెరుమాండ్ల కిషోర్ శ్రీ శ్రీదేవి భూదేవి సమెత శ్రీ చెన్నకేశవ స్వామి కి ఆభరణాల సమర్పించడం జరిగిందని గ్రామస్థులు తెలిపారుస్వామి వారికీ కిరీటం, స్వామి వారి వక్ష స్థలము, పాదములు, వెండి తో ఎంతో పవిత్రముగా భక్తి తో తయారు చేయించారని, చెప్పారు. శ్రీ చెన్న కేశవ స్వామి పై ఉన్న భక్తి కి సమర్పించారని అన్నారు.. ఆభరణాలు స్వామికి సమర్పించిన అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీరుకుళ్ళ గ్రామ ప్రజలు మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ చెన్నకేశ వ స్వామిని ప్రజలు తమ ఇల వేల్పుగా కొలుస్తారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తడక నీరజ- శ్రీను శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తాటిపర్తి మోహన్ రావు నీరుకుళ్ళ గ్రామ మాజి ఎంపిటిసి మానగాని శంకర్, ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్, అర్షం రాజేందర్, ఆలయ కమిటీ మెంబెర్స్, అంకతి రాజ్ కుమార్, అర్షం అహల్య, లొల్లటి రాజు, చెన్నకేశవ స్వామి లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీ యజమాని సంపెల్లి నర్సింగ రావు , కొండపర్తి శ్యామ్ ప్రసాద్,తడుక రవీందర్, ఉడుత మురళి, ఓదెల భీముడు, మనగాని నాగరాజు,అర్చకులు వద్దెవరం నవ్య గోపి పాల్గొన్నారు.


