April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఉర్సు చెరువు సుందరికరణ పనులను ప్రారంభించండి

జై భారత్ వాయిస్ న్యూస్: వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని ఉర్సు చెరువు సుందరికరణ పనులను వెంటనే ప్రారంభించాలని  నగర మేయర్  గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ పరిధి ఉర్సు చెరువు ప్రాంతం లో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు  చెరువులో చేయాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ ఉర్సు చెరువు సుందరికరణ అభివృద్ధి చేయడానికి రెండు కోట్లు రూపాయలు మంజూరు అయినందున అట్టి నిధులతో సుందరీకరించడం జరుగుతుందని ఇందుకోసం టెండర్ ప్రక్రియ పూర్తి అయినందున అందుకు అనుగుణంగా డిజైన్ రూపొందించి, ఈ ప్రాంతం లో  రేయిలింగ్, గ్రీనరీ ఏర్పాటుతో పాటు సమగ్ర సుందరికరణ చేయాలని  మేయర్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో సి ఎం హెచ్ ఓ రాజారెడ్డి, ఈ ఈ సంతోష్ బాబు, సానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఏ ఈ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???