Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలు

కందిబండ అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్నారుల క్రీడా పోటీలు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ) ఆత్మకూరు మండలం కందిబండ గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్‌లో తల్లుల కమిటీ సభ్యులు, చిన్నారులు వివిధ క్రీడా పోటీ లు జరిగాయి . ఈ పోటీలు తల్లులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల కోసం రన్నింగ్, బస్తా పరుగు, స్కిప్పింగ్, కుర్చీ పరుగు, రంగవల్లి వంటి పోటీలు నిర్వహించగా, పిల్లలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.అలాగే తల్లుల కమిటీ సభ్యులు కూడా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా స్థానిక అంగన్‌వాడీ టీచర్ ఆర్ష0 సుమలత మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని చిన్నారులను అభినందించారు. అంగన్‌వాడీ సెంటర్‌లో నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమం ఉల్లాసభరిత వాతావరణంలో సాగింది.

Related posts

జిల్లా స్థాయి  యోగాసన పోటీలు

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు

భారత మహిళా క్రికెట్ జట్టు విజయానికిసిఎం రేవంత్ రెడ్డి అభినందనలు