జై భారత్ వాయిస్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లోప్రసిద్ధిగాంచిన ఆది గణపతి స్వయంభూ క్షేత్రం అయిన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేకంగా పెన్నులతో పూజలు నిర్వహించారుఆలయ మహిమకు ఆకర్షితులై ఇతర జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యకు విఘ్నాలు తొలగించే గణనాథుని ఆశీస్సులుగా పెన్నుల ప్రసాదం.భక్తుల విరాళాలతో సమకూర్చిన కలములను రథసప్తమి పర్వదినాన విద్యార్థులు, భక్తులకు ప్రసాదంగా స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు.గణపతి ఆశీస్సులు నిండిన పూజ చేసిన పెన్నులు అందుకోవడానికి విద్యార్థినీ, విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.విద్యలో విజయం సాధించాలనే ఆకాంక్షతో చిన్నారుల కళ్లలో ఆశ, ఆనందం స్పష్టంగా కనిపించింది.ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి శ్రద్ధలతో,విద్యా సంకల్పంతో గణనాధుని నామస్మరణ మార్మోగింది.ప్రతి ఏడాది సంప్రదాయంగా కొనసాగుతున్న పెన్నుల పూజ – వితరణ కార్యక్రమం*గత కొన్ని సంవత్సరాలుగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పెన్నుల పూజ–వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రత్యేకమైన విశ్వాసాన్ని పెంచుతోందని భక్తులు అంటున్నారు.

