(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.అంతకముందు జాతర పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ గా వంచ రంగారెడ్డి డైరెక్టర్లు, అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.జాతర పాలకవర్గం అధికారులు సమన్వయంతో జాతరని విజయవంతం చేయాలని కోరారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.భక్తుల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, విద్యుత్ వంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.జాతరనుశాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతర ప్రాధాన్యత పెంచేలా కృషి చేద్దామని, మనందరి బాధ్యత అని అన్నారు. పాలకవర్గ సభ్యులు సేవకుల పనిచేయాలని, ప్రతి ఒక్కరు టీం వర్క్ చేద్దామని అన్నారు.


