April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గణతంత్ర వేడుకల్లో విద్యార్థులకు బహుమతులు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని ఆత్మకూర్ మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్, యుపిఎస్ పాఠశాలల విద్యార్థులకు ఆత్మకూరు జూనియర్ కళాశాల విద్యార్థులకు గ్రామపంచాయతీ సిబ్బందికి క్రీడలు నిర్వహించారు. సోమవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో మహమ్మద్ ఇమామ్ ఖాన్ ( ఖా న్ సాబ్ ) జ్ఞాపకార్థం ఇమామ్ ఖాన్ కుమారుడు ఎండి రజాక్ ఖాన్ కబడ్డీ కోకో వాలీబాల్, ఫుట్ బాల్ వ్యాసరచన వకృత్వ,క్విజ్, పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. అలాగే గ్రామపంచాయతీ సిబ్బందికి మొట్టమొదటిసారిగా క్రీడలు నిర్వహించిన ప్రోత్సాహ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు చేతుల మీదుగా బహుమతులను బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రజాక్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బీద మధ్యతరగతి విద్యార్థులకు చేయూతనందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కవిత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండెం రాజు ఉపాధ్యాయులు అయిత రాజు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

హనుమకొండ జిల్లాలో 25 నుండి ఓటరు సమాచార స్లిప్పుల పంపిణి

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం – ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News

విద్యార్థులు తార్కిక ఆలోచనలు పెంపొందించుకోవాలి