April 12, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నీరుకుళ్ళ లో వైభవంగా శ్రీ చెన్న కేశవుని కల్యాణం

L(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో నెలకొన్న శ్రీ దేవి భూదేవి సమేతశ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి కళ్యాణం వేద పండితులతో మంత్రోచ్ఛారణలతో నీరు కుళ్ళ ,పెంచికలపేట, కేశవాపూర్, హన్మకొండ, తదితర నగరాల నుంచివేల మంది భక్తులు తరలి వచ్చారు
భజన భక్తులు పాటలు పాడారు. భజన పాటలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఈ కళ్యాణానికి ఉప్పునూతల బ్రహ్మచారి, వడ్డేవరం బాబు, వడ్డే వరం వేణు, గోపాల స్వామి, వడ్డే వరం గోపి, వడ్డేవరం సాయి, వడ్డేవరం నవ్య వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలతో, దేవ దేవుని కళ్యాణం చేయించారు.కళ్యాణం అనంతరం మానగాని రాజు రజిత ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు ప్రసాద వితరణ చేసిన వారిని అభినందించారు.
నీరుకుల్ల గ్రామంలో నూతన సర్పంచిగా ఎన్నికైన తడుక నీరజ శ్రీను శ్రీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లు చేశారని గ్రామస్తులు దంపతులకు అభినందనలు తెలిపారు . పెనుగొండ కైలాసం ఆధ్వర్యంలో భజన బృందం పాడిన పాటలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.
కళ్యాణం అనంతరం దేవ దేవతలను గ్రామ వాడవాడలా ఎంతో భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలతో కోలాట లతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి శోభయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కూడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి , కడారి నవనీత రావు , కడారి రఘునాధ రావు గారు, చిదిరాల సుధాకర్ రెడ్డి గారు, జలగం నర్సింగరావు గారు, రిటైర్డ్ ఈ ఈ పెరుమాండ్ల సత్యనారాయణ ,నరశెట్టి ప్రవీణ్ , బొంపెల్లి రాజేశ్వర్ రావు , నీరుకుల్ల సర్పంచి తడక నీరజ శ్రీను, కేశవపూర్ సర్పంచ్ బాధరగని రమ రమేష్,ఆలయ కమిటీ చైర్మన్ తాడిపర్తి మోహన్ రావు ,ఆలయం కమిటీ వైస్ ఛైర్మెన్ అర్షం రాజేందర్, మాజీ ఎంపి టీసీ మానగాని శంకర్ , వెన్నపురెడ్డి రాజి రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ లు, ప్రముఖులు, భజన భక్తులు, నీరుకుల్ల పెంచికలపేట, కేశపురం గ్రామ ప్రజలు భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Related posts

సమ్మక్క సారలమ్మ జాతర కు వేలం పాట

పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి వేడుకలు

దళితుల అభ్యున్నతి కోసమే దళితబందు పథకం

Jaibharath News