Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జనం నుంచి వనం లోకి వెళ్లిన సమ్మక్క సారలమ్మ దేవతలు*ఆఖరి రోజున భక్తులతో కిటకిటలాడిన అగ్రంపహాడు

. (అగ్రంపహాడు నుంచి
జై భారత్ వాయిస్ ప్రతినిధి)
తెలంగాణ లో ప్రసిద్ధి గాంచిన మేడారం తర్వాత స్థాయిలో జరిగే ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన తల్లుల వన ప్రవేశం భక్తుల జన సందోహం, శివ సత్తులు పునకాల మధ్యన ఘనంగా జరిగింది. సమ్మక్క సారలమ్మల పూజారులు తొలుత బలిహరణ కావించి డప్పు చప్పుల్ల తో , డోలు వాయిద్యాల తో సంప్రదాయ పద్ధతిలో తల్లుల ను పూజారులు
వన ప్రవేశం చేశారు. దీనితో తల్లులు జనం నుంచి వనంలోకి వెళ్లారు. ఆఖరి రోజు అయిన శనివారం వేలాది మంది భక్తులు తల్లులకు తన్మయత్వంతో ప్రణమిల్లారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లుల కు గత మూడు రోజులుగా మొక్కలు అప్ప జెప్పారు. ఆఖరి రోజు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు ఇప్పటివరకు 15 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు ఆదివారం సైతం వేలాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నట్లు అంచనా వేసి, హుండీల ను తరలించుకునీ వెళ్లకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.గత మూడు రోజులుగా లక్షలాదిమంది భక్తులు దర్శించుకునేందుకు అధికారులు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. అగ్రంపహడు జాతర సజావుగా సాగేందుకు జాతర కమిటీ చైర్మన్ వంచ రాజిరెడ్డి సర్పంచ్ గంగుల మహేందర్,మాజీ చైర్మన్ బోరిగం స్వామి మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి సీఐ సంతోష్ ఈవో నాగేశ్వరరావు ఎండీ ఓ శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ జగన్ మోహన్ రెడ్డి, లు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు ఎలాంటి తొక్కేసలాటం జరగకుండా ఏర్పాట్లు చేశారు 24 గంటలు విద్యుత్ సౌకర్యం ఉండడం వల్ల అగ్రంపహడు జాతర రాత్రి వేళల్లో కాంతిలో దగదగా మెరిసింది జాతరలో సమ్మక్క సారలమ్మలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ ఇనగాల వెంక ట్రామ్ రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అగ్రంపాడు సమ్మక్క సారలమ్మల జాతరకు ఈ సంవత్సరం లక్షలాది మంది తరలి రావడంతో వ్యాపారం బాగా సాగిందని మిఠాయి షాపులు హోటల్లు తదితర చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. జాతర ను నమ్ముకుని గత నెల రోజులుగా చిరు వ్యాపారులు అగ్రంపహాడు సమీప పరిసరాలలో టెంట్లు వేసుకుని వివిధ రకాల వస్తువులను భక్తులకు అమ్మారు జాతర అక్కంపేట పెద్దాపురం చౌల్లపల్లి అగ్రంపహడు తదితర గ్రామాల పరిధిలో దాదాపు పది కిలోమీటర్ల వైశాల్యంలో జాతర సాగింది. మళ్లీ వచ్చే జాతరకు మళ్ళీ వస్తామన్నవి తమ పిల్లలను చల్లంగా చూడాలని రైతులు మహిళలు అమ్మలకు సాగిలపడి మొక్కారు

Related posts

హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

Jaibharath News