Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాజకీయ కక్ష్యాతోనే కేసిఆర్ ఆర్ కి  సిట్ నోటీసులు.

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,  కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ, నేడు గీసుగొండ మండలంలోని కొనాయమాకుల గ్రామంలో వరంగల్ నర్సంపేట రహదారిపై గీసుగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో  నల్ల బ్యాడ్జిలతో నిరసన ధర్నా కార్యక్రమనన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు  మాట్లాడుతూకేసీఆర్ పై అక్రమ కేసులు, సిట్ నోటీసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు.ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి,బీ.ఆర్.ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం మరియు బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టి కక్ష్యసాధింపు చర్యలకు  పాల్పడుతుందన్నారు…ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పిటిసి పోలీసు ధర్మారావు, శ్రీకాంత్ . ప్రకాష్  బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు గడువు ఫొడగింపు

కోట్ల రూపాయల భవనాన్ని వరంగల్ శ్రీ శృంగేరి శంకర మఠం అప్పగించిన దాతలు-

ఎ. జ్యోతి