(అగ్రంపహాడు నుంచి జై భారత్ వాయిస్ ప్రతినిధి)
తెలంగాణ రాష్టంలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన అగ్రంపహాడు సమ్మక్క జాతర గత నాలుగు రోజులుగా వైభవంగా జరిగింది. అగ్రంపహాడు సమ్మక్క జాతరకు కిలోమీటర్ల మేర విడుదల చేసిన భక్తులు తిరుగు ప్రయాణం కట్టారు ఆదివారం సైతం వేలాది మంది భక్తులు అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చి తల్లులకు మొక్కులు అప్పజెప్పారు. జై సమ్మక్క అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగిన అగ్రంపహాడు నేడు ఖాళీ అవుతున్నది. లక్షలాదిమంది భక్తులను తరలివచ్చిన ఈ మహా జాతరను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, జాతర విజయవంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు గత 15 రోజులుగా తగిన ఏర్పాట్లతో నిమగ్నమైన అధికారులు రెవెన్యూ ఎక్సైజ్ పోలీసు దేవాదాయ , ఆరోగ్యశాఖ అధికారులు జాతర ప్రశాంతంగా ముగియడంతో సంతోషం వ్యక్తం చేశారు. చివరి రోజు అయిన ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగినప్పటికీ పోలీసులు సహకారంతో సుదర్శనాలు సజావుగా జరిగాయి భక్తులు తల్లుల దీవెనలు పొంది పసుపు కుంకుమలు ధరించి భక్తులు వచ్చే జాతరకు మళ్ళీ వస్తా మమ్మా తల్లీ, సమ్మక్క తల్లీ అంటూ మొక్కులు చెల్లించి వెనుదిరిగు తున్నారు. వనదేవతల దర్శనం ముగించుకున్న భక్తులు తాము వేసుకున్న తాత్కాలిక గుడారాలను తొలగించి తమ సామాన్లను సర్దుకుని తిరుగు ప్రయాణం కడుతున్నారు జాతర అధికారికంగా ముగిసి దేవతలు వన ప్రవేశం చేసినప్పటికీ అగ్రంపహాడు జాతరలో భక్తుల మొక్కుల పర్వ ఇంకా కొనసాగింది భక్తుల రద్దీ ఊహించిన స్థాయిలో ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడలేని వృద్ధులు చిన్నపిల్లల కుటుంబాలు ఎప్పుడు ఆదివారం నెమ్మదిగా మొక్కులు చెల్లించారు తొక్కేసేలాటలో రద్దీభయంతో అప్పుడు రాలేకపోయిన భక్తులు ఆదివారం గద్దె ల వద్దకు చేరుకొని ప్రశాంతంగా నిలువెత్తు బంగారం బెల్లం సమర్పించి మొక్కలు తీర్చుకుంటున్నారు. రానున్న జాతర వరకు తమ పిల్లాపాపలను చల్లంగా చూడాలని మొక్కారు.
-భారీ బందోబస్తు మధ్యన హుండీల తరలింపు
ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క జాతర నాలుగు రోజులు జరిగిన తర్వాత జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన హుండీలు భారీ బందోబస్తు మధ్యన తరలించారు. అధికారులు హుండీలను సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు చౌడమ్మ గద్దెలపై ఉంచారు భక్తులు హుండీలో కానుకలు వేశారు జాతరలో ఏర్పాటు చేసిన 58 హుండీలను తరలించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు ఆఖరి రోజు జాతరను ఉత్సవ కమిటీ చైర్మన్ వంచ రంగారెడ్డి మాజీ చైర్మన్ బొరిగం స్వామి ఈవో నాగేశ్వరరావు గ్రామ సర్పంచి గంగుల మహేందర్ ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి రెవెన్యూ తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి ఎండిఓ శ్రీనివాసరెడ్డి జాతర కమిటీ డైరెక్టర్లు పర్యవేక్షించారు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తరలించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. జాతర లో వివిధ శాఖల అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు.




