జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ హైస్కూల్, ఎస్సెస్సీ 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని , కొనాయమాకుల లోని పి యస్ ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమంలో గీసుకొండ హైస్కూల్ లో పనిచేసిన ఆనాటి పూర్వపు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మోరె రాజేశ్వర్ రావు, ఉపాధ్యాయులు జక్కోజు చంద్రశేఖర్ రావు, ఎం డి జె రెహమాన్ కర్ణకంటి రాంమూర్తి పాల్గొనగా పూర్వ విద్యార్థులు తాటికొండ నరేందర్, ఆసం లింగమూర్తి, యంబాడి నర్సింహస్వామి, సయ్యద్ ఇర్ఫాన్, బోడకుంట్ల రాజు,నర్శెట్టి రాజు, బిట్ల శివప్రసాద్, గుడిమెట్ల శ్వేత, ముల్క శ్రీదేవి, యంబాడి రాణి, అల్లె శ్రీలత, దౌడు ప్రభావతి, తుప్పరి రమాదేవి, రజిత తదితర 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు చదువుకున్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అందరూ సంఘటితంగా ఆపప్న హస్తం అందించాలని తీర్మానించుకున్నారు.
previous post

