(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ,దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ , ఆహ్వానించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

