(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)గీసుకొండ మండల కేంద్రంలో
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలోమహా శివరాత్రి పర్వదిన వేడుకలు నయనానందకరంగా జరిగాయి.లోక కళ్యాణార్థం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది.వేద పండితులు భిక్షపతి దైవజ్ఞ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ, మంగళ వాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణ ఘట్టాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.శివరాత్రి నాడు సాక్షాత్తు శివ స్వరూపుడైన బ్రహ్మంగారి కళ్యాణం జరిపించడం వల్ల గ్రామానికి, భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురోహితులు శ్రీ భిక్షపతి దైవజ్ఞ భక్తులకు ఆశీర్వచనం అందించారు.ఈ కళ్యాణోత్సవంలో పలువురు దంపతులు స్వామి వారి సేవలో తరించారు. ఈ క్రతువులో ఉభయ దాతలుగా ముఖ్యకర్తలుగాతాటికొండ మల్లేశం కర్ణకంటి సత్యనారాయణ, కర్ణకంటి రాజేంద్రాచారి, కర్ణకంటి బ్రహ్మాచారి, కర్ణకంటి రామ్మూర్తి, కర్ణకంటి మొగిలి,తాటికొండ సత్యం దంపతులు భక్తులు పాల్గొన్నారు


