ఆత్మకూరుకు ఆధ్యాత్మిక శోభ నిస్తున్న పంచలింగాల మహాదేవ ఆలయం
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు న్యూస్)భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన దక్షిణముఖ పంచలింగాల ఆలయం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో భక్తుల కొంగుబంగారంగా నిలిచి ఆధ్యాత్మిక శోభనిస్తున్నది. కాకతీయుల సామ్రాజ్య కాలంలో నిర్మించిన పంచ లింగాల దక్షిణ ముఖమహాదేవ స్వామి నేటికీ భక్తుల పూజలందుకుంటున్నారు. భారతదేశంలో రెండు దేవాలయాలు ఉండగా ఆత్మకూరులో పంచలింగాల ఆలయం పేరుగాంచింది. కాకతీయుల కాలంలో కరువు కాటకాలు ఏర్పడ్డ కాలంలో కాకతీయ రాజులు పంచలింగాల ఆలయాన్ని నిర్మించారని చరిత్ర తెలుపుతున్నది. ఈ ఆలయ నిర్మాణంతో కాకతీయ సామ్రాజ్యంలో కరువు కాటకాలు నశించిపోయి ప్రజలు ధన ధాన్యాలతో తుల తుగి వున్నారని చరిత్ర ను బట్టి తెలుస్తుంది. అప్పటినుంచి ఆలయం ఆలయం జీర్ణావస్థలో ఉండగా భక్తుల విరాళాల తో పునర్ నిర్మాణం కావించారు. వేద పండితుల ఆదేశానుసారము స్థానికులు ముందుకు వచ్చి పంచలింగాల మహాదేవ ఆలయానికి పునర్నిర్మాణం చేసిన తర్వాత పూజలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరులో నెలకొన్న శిల్ప సంపద తోఅలరారుతున్న పురాతన పంచలింగాల ఆలయం లో మహా దేవ స్వామి భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతున్నారనివివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయాన్ని సందర్శించడానికి తరలి వస్తున్నారు. విశేషమైన ఈ ఆలయానికి వివిధ జిల్లాలతో పాటు హైదరాబాదు నుంచి భక్తులు తరలివచ్చి మహాదేవ స్వామిని సేవిస్తున్నారు. అరుదైన పంచలింగా ఆలయానికి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహించి తన్మయత్వం చెందుతున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు మహాశివరాత్రి సందర్భంగా పంచలింగాల ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు శివాలయానికి విచ్చేసి మహాదేవునికి పంచ అమృత లతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వహించారు రుద్ర పారాయణ నమ్మక చమకాలతో మీద పండితుల మంత్రం వచ్చారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో పంచలింగాల ఆలయము కిక్కిరిసిపోయింది

