Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగా పోటీలో అభినవ నేతాజీకి కాంస్య పతకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగ పోటీలలో అభినవ నేతాజీ కాంస్య పతకం గెలుచుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె నుంచి పట్టణం వరకు క్రీడాకారుల ప్రతిభను వెలికి  తీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ కప్ 2025 రెండవ ఎడిషన్. క్రీడా పోటీలు ప్రభుత్వం నిర్వహించారు.అందులో భాగంగా ఈ నెల 21 22 తేదీల్లో హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 19 యోగా పోటీలలో ఆర్టిస్ట్ యోగ విభాగం లో వరంగల్ జిల్లాకు చెందిన అడుప అభినవ నేతాజీ కాంస్య పతకం (బ్రాంజ్ మెడల్) కైవసం  చేసుకున్నాడు. క్రీడా నిర్వాహకులు అభినవ నేతాజీ కి బ్రాంజ్ మెడల్ సర్టిఫికెట్ ను బహుకరించారు.యోగా కోచ్ లు బొలిశెట్టి కమలాకర్, పాకాల రవీందర్, శ్రీనివాస్, కోట రజిత, పాష అభినవ నేతాజీకి అభినందనలు తెలిపారు

Related posts

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత సిఎం రేవంత్ రెడ్డి

ఎ. జ్యోతి

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

స్థానిక సంస్థలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయాలి