(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్):ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రానికే ఆత్మకూరు ను ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి అన్నారు సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ 35 లక్షలతో ఎస్సీ,ఎస్టి సబ్ ప్లాన్ రోడ్లు ,బీసీ కాలనీ, ముదిరాజ్ కాలనీలలో 30 లక్షలు జనరల్ ఫండ్ నుండి సిమెంట్ రోడ్లను లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆత్మకూరు ప్రజలు ఆదరించారని అన్నారు. సర్పంచిగా ప్రభుత్వం నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దు తా మని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆదరించి సర్పంచ్ గా గెలిపించడంతో మరింత బాధ్యతతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సహకారంతో 54 కోట్లతో ప్రతి ఇంటికి ఆత్మకూర్ గ్రామంలో సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయించామన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఇబ్బంది లేకుండా 60 లక్షలతో ప్లాస్టిక్ చెత్త శుద్ధికరణ ప్లాంటును ఏర్పాటు చేయించామని అన్నారు. గ్రామపంచాయతీ నిధులతో పలు కాలనీలలో సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేపీస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అండదండలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఆత్మకూరు గ్రామాన్ని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆత్మకూర్ ప్రజల సహకారంతో ఆత్మకూరును ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరీ అన్నారు


