Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో భగవద్గీత పారాయణం

జై భారత్ వాయిస్ గీసుగొండ

ప్రజలందరూ ధర్మ బద్ధంగా నడుచుకేందుకు భగవద్గీత పారాయణం ఉపయోగపడుతుందని చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, అన్నారు గీసుకొండ మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహిత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, గీసుకొండ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉషారాణి, . నమ్రత, ఎల్ ఐ సి ఉద్యోగి వి. చంద్రశేఖర్, పింగళి కాలేజీ సంస్కృతం లెక్చరర్ ఎన్. శ్రీవిద్య, టీసీఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వి. హరిప్రియ పాల్గొని భగవద్గీత  సామూహిక పారాయణం చేయించారు. వీరితోపాటు అర్చకులు పాకాల శ్రీనివాస్, దేవాలయ కమిటీ సభ్యులు తాటికొండ బ్రహ్మచారి, బండారు నరేందర్, కర్ణకంటి రాంమూర్తి, బోడకుంట్ల ప్రభాకర్, మహిళలు నర్శెట్టి శ్రావణి, బండారు శోభ, సుభద్ర   పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ

గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

గంగదేవిపల్లిలో16 నుండి  వికసిత్ భారత్ సంకల్ప యాత్ర