(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) :
శ్రీరామనవమి సందర్భంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోను గ్రామాలలోనూ శ్రీ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో, సాయిబాబా ఆలయంలో, గూడెపాడు లోని శ్రీరామాలయంలోనూ, అక్కంపేటలోని శ్రీ రామాలయంలోనూ, నీరుకుల్ల గ్రామంలో నెల కొన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి చింతాకు పతకము వేదపండితుల ధరింప చేసారు., ముత్యాల తలంబ్రాలు పండితులు భక్తులు శ్రీ సీతారాములకు పోశారు .వేద పండితులు వడ్డవరం బాబు, గోపాల స్వాములు వేద మంత్రాల తో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో సీతారాము లను దర్శించుకుని పట్టు వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ జనగాం నర్సింగరావు వైస్ చైర్మన్ పుల్లూరు బుచ్చి రాములు, మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ , మాజీ సర్పంచ్ ఉడుత సంగీత,శ్రీ సిద్ద లింగేశ్వర దేవాలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ వెన్నపురెడ్డి రాజి రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మాజీ కార్యదర్శి చిదిరాల సుధాకర్ రెడ్డి, ఉత్సవ నిర్వాహకులు కాకాని లక్ష్మణ మూర్తీ, పెంచికల్పేట మాజీ సర్పంచ్ చిట్టే రవి, నీరు కుళ్ళ గ్రామ మాజీ వార్డు మెంబర్ పోతరాజు ఈశ్వర్, నిర్వాహక కార్యదర్శి అంకతి రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా నీరు కుళ్ళ దేవాలయం లో జరిగిన ఈ కల్యాణానికి నీరుకుళ్ళ, పెంచికలపేట, కేశవాపూర్ గ్రామాల ప్రజలు సీతారాముల దర్శించుకోవడానికి తరలివచ్చారు .ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ కళ్యాణంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు భక్తులు ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం పుర వీధుల లో శోభా యాత్ర నిర్వహించారు.

