April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నీరుకుల్లలో స్వయంభుగా వెలసిన శ్రీచెన్నకేశవస్వామి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు);
హన్మకొండజిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన శ్రీచెన్నకేశవస్వామి భక్తుల కోర్కెలను నెరవేర్చుతున్నాడని పలు గ్రామాల భక్తులు విశ్వసిస్తారు. తరతరాల నుంచి శ్రీచెన్నకేశవుని పలు గ్రామాల నుంచేగాక హైదరాబాద్,వరంగల్,తదితర జిల్లాల నుంచి విచ్చేసి ప్రజలు శ్రీ చెన్నకేశవుని కొలుస్తారు. కోరిన కోర్కెలు ఈడేరిన చిన్న భక్తులు ఇక్కడికి వచ్చి ఒకరోజు విడిది చేసి మొక్కులు చెల్లిస్తారు.తరతరాల నుంచి శ్రీ మహా విష్ణుమూర్తి రూపంలో దర్శన మిస్తున్న చెన్నకేశవుని కథ నీరుకుల్ల గ్రామ వాసులు చెపుతుంటారు. వందల ఏళ్ల క్రితం ఈచెరువు ప్రాంతం లో సిద్ధులు తపస్సు చేసి చెన్నకేశవస్వామిని సాక్షాత్కారం పొందారని అంటారు.కాకతీయులకు పూర్వము నీరుకుల్ల చెరువు పరివాహక ప్రాంతంలో సహజసిద్ధంగా, స్వయంబువుగా,నెలకొన్న శ్రీచెన్నకేశవుడు భూమి మీద నుంచే దేవాలయం లేకుండనే భక్తులు దర్శించుకునే వారు. సహజ సిద్ధంగా నెలకొన్న శ్రీదేవదేవునికి పూలపొదలు,తీగలు అల్లుకొని ఎండకు వర్షానికి గొడుగులాగా ఉండేదని భక్తులు చెప్పారు.అలాగే ముళ్ళపొదలలో ఒక పుట్టఉండేదని అందులో నాగసర్పము బయటికి వచ్చి ఎల్లవేళల శ్రీచెన్నకేశవస్వామి పాదాల ముందు ఉండేదని వృద్ధులు తెలిపారు.అనేక గ్రామాల ప్రజలు తరలి వచ్చి దర్శించుకునేవారు. కాలక్రమంలో నీరుకుల్ల,పెంచికల్ పేట,కేశవాపురం నుంచి భక్తులు ముందుకు వచ్చి శ్రీచెన్నకేశవస్వామికి దేవాలయం కట్టాలని యోచించారు.అనంతరం మూడు గ్రామాల ప్రజలు కాక ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు విరాళాలను సేకరించి దేవదేవునికి దేవాలయం నిర్మించారు.దేవాలయం నిర్మించగా కొంతభాగం అభివృద్ధి చేయాల్సి ఉండెను. కాగా చెన్నకేశవస్వామిని లక్ష్మీచారులు అని స్థానిక ప్రజలు కొలుస్తారు.శ్రావణం మొదలు కొని విశేష పూజలు నిర్వహిస్తారు. నిత్యపూజలు నిర్వహిస్తారు.

శ్రీచెన్నకేశవస్వామి దేవాలయానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు చేయూత

ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ చెరువు పరిసర ప్రాంతాలలో స్వయంభువుగా వెలసిన శ్రీచెన్నకేశవస్వామి దేవాలయ అభివృద్ధి కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రేవూరి చిరంజీవిరెడ్డి చేయూతనిచ్చినారని శ్రీశ్రీ చెన్నకేశవస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ తాటిపర్తిమోహన్ రావు తెలిపారు. దేవాలయం చుట్టూ సీసీ నిర్మాణానికి కృషి చేశారని ఆయన తెలిపారు.చెన్నకేశవస్వామి దేవాలయ ఆవరణలో గుంతలు ఏర్పడగా దానిలో లారీల కొద్దీ ఎర్ర మట్టిని తెచ్చి గుంతలు పూడ్చి చదును చేశారని ఆయన వివరించారు.ఆలయ ఆవరణలో ఆహ్లాదకరంగా ఉండేందుకు మొక్కలు ఏర్పాటు చేశారని మోహన్ రావు వివరించారు.దేవాలయఅభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.తరతరాలనాటి దేవాలయం నీరుకుల్లా,పెంచికలపేట,కేశవపురం గ్రామాల ఇలవేల్పు శ్రీచెన్నకేశవస్వామి దేవాలయ అభివృద్ధి కోసం ముందుకు రావాలని అన్నారు.ఈసందర్భంగా మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ హాజరయ్యారు.

Related posts

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) అప్పయ్య..

ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి

Jaibharath News

నాణ్యతలేని భోజనన్ని విద్యార్థులకు పెడుతున్న యూనివర్సిటీ అధికారులు