April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బాల్య స్నేహితుడికి చేయూత helping hand to a childhood friend

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
స్నేహమేరా కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ,మానసిక బలాన్ని ఇస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అరుదైన బంధం ఇది.స్నేహితులు మన జీవితంలో భాగమై,ఒంటరితనాన్ని దూరం చేసి, ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంకుస్ కు అండగా ఆపదలో మీ నేస్తం మీకు మేమున్నాం అంటు చిన్నా నాటి స్నేహితులు ఆర్థిక సాయం అందించి మనోధైర్యం కల్పించారు.Ahelping hand to a childhood friend గీసుకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీసుకొండ, ఎస్సెస్సీ 1991-1992 బ్యాచ్ కి చెందిన షేక్ అంకూస్ పాషా అనే నిరుపేద వ్యక్తి, ఇటీవల హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, అతని బాల్యస్నేహితులు మానవత్వంతో స్పందించి రూ25, 000 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, స్నేహ ధర్మం చాటుకున్నారు. ఈకార్యక్రమంలో అతని బాల్య స్నేహితులు దోపతి అరుణ, తొగిటి ఉమారాణి, ఆదూరి విజయ సుశీల, గుండా నరేష్, చాడ సంజీవరెడ్డి, వీరగొని శ్యామ్,కామని రమేష్,కోల వేణు,జన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి,పాకనాటి సారంగపాణి, ఎనబోతుల సదానందం, దేవులపల్లి మల్లేశం,.కర్ణకంటి రాంమూర్తి-రజిత దంపతులు పాల్గొన్నారు.

Related posts

Lic insurance employee’s నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా  ధర్నా ఎల్ ఐసి ఉద్యోగులు ఏజెంట్స్

దర్మారం లో కంది పంటక్షేత్రదినోత్సవం

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Jaibharath News