(జై భారత్ వాయిస్ న్యూస్ తిరుమల)ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి ఆలయంలో భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతుందనీ భక్తులు వివరించారు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనానికి ఎక్కువ సమయం గడిచి పోతున్నారని అన్నారు. రూ 300 టోకెన్ తీసుకున్న భక్తులకు కేవలం 3గంటల లోనే దర్శనం అవుతున్నాడని తెలిపారు.సెలవు రోజులు కావడంతో శని ఆదివారాలలో భక్తుల ఎక్కువ మంది రావడంతో తిరుమల ఆలయము భక్తుల తోకిక్కిరిసిపోయింది మహిళలు పిల్లలు వృద్దులు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు కోరి న కోరికలు తీర్చే ఏడుకొండల వాడిని కనులారా చూసి తరించాలని కోరుతూ మహిళలు పిల్లలు వృద్దులు గోవింద నామాలు పలుకడం తిరుమల హోరెత్తిపోయింది . కొండలలో నెలకొన్న కోనేటి రాయుడికి భక్తిప్రపతులతో భక్తులు సాగిలపడి మొక్కారు భక్తులు ఏడుకొండలవాడిని ఏడు ద్వారాలు ముందు నుంచే దర్శనం చేసుకుని తరించామని అన్నారు ఆదివారం స్వామి సేవ గజరాజులు వెంటరాగా వేద పండితులు ముందు నడవగా ,దివిటీల తో మేళ తాళాలతో భజనలతో స్వామిని మాడవీధుల ఊరేగింపు నిర్వహించారు లక్షలాది మంది భక్తులు కొండకు ఆదివారం రావడంతో కొండ ప్రాంతం భక్తుల రద్దీ మయమైంది భక్తులు శ్రీవారి పుష్కరినీ లో స్నాన ఆచరించి ముందుగా వరాహస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వరాహ స్వామి దర్శనము భక్తులకు దాదాపు రెండు గంటల సమయం పడుతుందని పలువురు వ్యక్తులు వివరించారు. అనంతరం భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వెళ్తున్నారు .కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారిని అత్యంత భక్తి ప్రపతులతో సేవించుకుంటున్నారు గోవింద గోవిందా ఏడుకొండలవాడా గోవిందా అంటూ నామాలు పలకడంతో కొండ ప్రాంతం హోరెత్తిపోయింది.
తిరుమలలో అడుగడుగున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


