(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 17న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ ఉప్పునూతుల శంకర్ జి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా హిందువులను సంఘటితం చేయడంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమ్మేళనంలో హైదరాబాద్ లోని పురాణపీఠం అనంతసాహితీ ఆశ్రమం స్వామి అనంతానంద భారతి తోపాటు ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచార ప్రభు కుమార్ రాష్ట్ర సేవిక సమితి జిల్లా కార్యవాహిక సముద్రాల కవిత హాజరవుతారని తెలిపారు. సమ్మేళనంలో అతిథుల ఉపన్యాసాలతో పాటు గోపూజ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ
కార్యక్రమాల్లో ఆత్మకూరు మండల కేంద్రం తో పాటు కామారం చౌల్లపెళ్లి , నీరుకుల్ల, పెంచికలపేట గ్రామాల నుండి హిందువులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు టింగిలికారీ సత్యనారాయణ ,కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొంకీసు సాంబ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదం వెంకటేశ్వర్లు, కోశాధికారి నాగ బండి శివప్రసాద్, ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ కందగట్ల విజయకుమార్ , ఆత్మకూరు వికాస తరంగిణి ఇంచార్జ్ పోలు రాజేష్ కుమార్, ఉప కోశాధికారి కపిల్, శివాజీ విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఎరుకొండ రవీందర్ గౌడ్, ఆర్ఎస్ఎస్ కళాశాల ప్రముఖ సాయిసేన్, రాజ్ కుమార్, ఉప్పునూతుల శ్రీనివాస్, మేకల మల్లయ్య, కట్కూరి కృష్ణారెడ్డి, తాళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

