జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ:
హన్మకొండ లోని గాంధీ నగర్ నివాసి సామాజిక కార్యకర్త ఈవి సతీష్ కుమార్ ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ సమస్య తీవ్రత పెరగడంతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారంనాడు బ్రెయిన్ డెడ్ కాగా, జీవన్ దాన్ వైద్య బృందం అవయవదానంపై ఆయన భార్య అనురాధ,సోదరుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్, రెడ్ క్రాస్ పాలక సభ్యులు ఇవి,శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అంగీకరించగా కాలేయము,ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా అమర్చటంతో ఇద్దరికీ పునర్జన్మను ఇవ్వటం జరిగింది, నేత్ర దానం చేయడంతో ఇద్దరి అందులకు చూపును ప్రసాదించినట్లయింది. శుక్రవారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ సభ్యులు ధన్యజీవి అవయవ (ప్రాణ)దాత కీర్తిశేషులు ఈవి సతీష్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి అవయవ దాన త్యాగం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సతీష్ కుమారుడు అమీన్ రానా, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లి ఉపేందర్ రెడ్డి, సామాజిక నిర్మల శ్రీనివాస్, పద్మ, పరికిపండ్ల వేణు, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
previous post

