ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో మండలాభివృద్ధి సాధ్యమని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని తాగునీరు, విద్యుత్ సరఫరా, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు, గ్రామాల్లో కనీస సౌకర్యాలను కల్పించడం వంటి వివిధ రకాలైన అంశాలపై సమావేశంలో చర్చ సాగింది. అలాగే గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారంలో సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించడం లేదని దామెర. దుర్గంపేట, ముస్త్యాలపల్లి సర్పంచ్లు గురిజాల శ్రీరాంరెడ్డి, పురాణం రాజేశ్వరి ఈశ్వర్, వడ్డేపల్లి శ్రీనివాస్ లు సమావేశంలో ప్రస్తుతించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కాగితాల శంకర్ మాట్లాడుతూ మండలంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో సమష్టి కృషి ఎంతో అవసరమని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ గరిగె కల్పనకృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్, ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, గోవిందు సంద్యఅశోక్, గండు రామకృష్ణ,