(జై భారత్ వాయిస్ దామెర ) ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలని, తద్వారా మరో ఇద్దరు అంధులకు చూపునివ్వాలని దామెర పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుల సూచించారు. సోమవారం దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుల పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దామెర పీహెచ్ సి లో అందిస్తున్న వివిధ రకాలైన సేవలతో రూపొందించిన కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల మాట్లాడుతూ సమాజంలో కంటి చూపునకు నోచుకోకుండా ఎంతో మంది అందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అసక్తి కలిగిన వారు ప్రతీ ఒక్కరూ నేత్రదానం చేయొచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో అప్తాల్మిక్ ఆఫీసర్ ప్రకాష్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ సాహితి, హెచ్ఎస్ఈవో అశోక్, హెల్త్ సూపర్వైజర్లు పి.శ్రీకాంత్ . భాగ్యలక్ష్మి, పిహెచ్ సి సిబ్బంది పాల్గొన్నారు.
previous post
next post