దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను మరవద్దు
-బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ చందర్ రెడ్డి.
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు);
దేశం కోసం తమ ప్రాణాలను ఫనం గా పెట్టిన వీరుల త్యాగాలను మరువకూడదని బిజెపి పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పెసరు
విజయ్ చందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మేరీ మిట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తుల అమృతస్మృతి వనo నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా ఇంటింటికి మట్టి సేకరణచేపట్టారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అమృత కలశానికి పూజ, పంచ ప్రాణ్ ప్రతిజ్ఞభావించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరించి ఢిల్లీ స్మృతి వనానికి తరలించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మోదీ చేపట్టిన సంకల్పానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలనిఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల బి జె పీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, ఆర్.టి.ఐ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్, కిసాన్ మోర్చా పరకాల కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు గుళ్లపల్లి వెంకటేశ్వర్లు, ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు వెలిదే సదానందం, పూజారి సత్యనారాయణ మండల కార్యదర్శులు పైడాచార్య, జిట్ట మధు, బూత్ అధ్యక్షులు పిసాల సాంబయ్య, భయ్యా మలగాం, రామకృష్ణ, సమ్మయ్య, కుక్కల సదయ్య, భయ్యా బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.