గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ…..
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యాదవులకు ప్రభుత్వం అందజేసిన 12 యూనిట్ల గొర్రెలను వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వాతి భగవాన్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి, యాదవులను ఆర్థికంగా ఎదిగే విధంగా సహాయపడ్డారని, మనందరం తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే రోజుల్లో మూడోసారి ముఖ్యమంత్రిగా,చల్లా ధర్మారెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ ధర్మనాయక్, ఆత్మకూరు టౌన్ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాపని రవీందర్, సొసైటీ డైరెక్టర్ వీర్ల వెంకటరమణ, వార్డ్ మెంబర్లు,బిఆర్ఎస్ శ్రేణులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.