జై భారత్ వాయిస్ దామెర
దామెర మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పుట్టిన రోజు పురస్కరించుకుని దామెరలోని పురాతన శివాలయాన్ని ఆయన సం దర్శించారు. ఈ నేపథ్యంలో కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక మొక్కులు సమర్పించారు. నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా ఉం డాలని ప్రార్ధించారు. అనంతరం శివాలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ బిల్లా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామెరలోని ఎంతో పురాతన ప్రాశస్తం కలిగిన శివాలయ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. చారిత్రక నేపథ్యం కలిగిన శివాలయం నిర్మాణా దానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా శివాలయ పునర్నిర్మాణ కమిటీ చైరన్ బిల్లా రమణారెడ్డి, శివాలయ పునర్నిర్మాణ ధర్మకర్తలు పోల్సాని ఇంద్రారెడ్డి, పోల్సాని రాంరెడ్డి, పోల్సాని శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గరిగె కల్పనకృష్ణమూర్తి, బీఆర్ఎస్ దామెర గ్రామ శాఖ అధ్యక్ష్య, కార్యదర్శులు బత్తిని రాజుయాదవ్. వేల్పుల ప్రసాద్. గడ్డం సదానందం. హింగే బాబురావు, సంతోష్, కిషోర్, రాకేష్, దామెర రమేష్, దామెర రవి, బత్తిని రాజు, మిరాల రవి, మేరుగు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు