Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

జై భారత్ వాయిస్ వరంగల్
గీసుకొండ మండలంలో పరకాల నియోజకవర్గ కుమ్మర్ల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి అద్వర్యంలో నిర్వహాంచారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు రామూర్తి , బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ హజరైనారు. ఈ సవదర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలని రాజకీయ పార్టీల నేతలను కొరారు. గీసుకొండ మండలంలొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కుమ్మరులకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆధునికమైన యంత్రాలతో యూనిట్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కుమ్మర్లకు అన్ని మండలాలలో కమ్యూనిటీ హాల్ గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కొరారు .BC లోన్ల కు దరఖాస్తు చేసుకున్న కుమ్మరు లందరికీ మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలొ పత్రి నియోజకవర్గంలో కుమార్లకు పది నామినే ట్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం గ్రామ సర్పంచ్ అశోక్ వరంగల్ జిల్లా కోశాధికారి రుద్రారపు శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఆవునూరి కుమారస్వామి గీసుకొండ మండల అధ్యక్షులు కందికొండ రాజు ఖిలా వరంగల్ మండల అధ్యక్షులు ఆకారం సమ్మయ్య సంగం మండలం ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కొమ్మాలు కందికొండ మొగిలి కందికొండ కుమారస్వామి కందికొండ శ్రావణ్ ప్రజాపతి కందికొండ లింగమూర్తి ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు

Related posts

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

Jaibharath News

ఉపాధి కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలి-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

గీసుకొండ లో వైభవంగా బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం