Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ సీడీపీవో భాగ్యలక్ష్మీ సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన పోషణ ప్రతిజ్ఞలో ముఖ్య అతిథిగా సీడీపీవో భాగ్యలక్ష్మీ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు విధిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. స్థానికంగా అందుబాటులో ఉంటే ఆహార పదార్థాలల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబరు మాసంలో నిర్వహించే పోషణ మాసం కార్యక్రమాలను ప్రణాళికా ప్రకారం ప్రతీ రోజు నిర్వహించాలని సూచించారు. పోషణ మాసం ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని పాఠశాలల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో దామెర పీహెచ్ సి.  మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుల, దామెర మండల ఐసీడీఎస్ సూపర్వైజర్లు పద్మావతి, రాణి, దామెర మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు లీలావతి. శోభారాణి, శ్యామల, వాణి, కోమల, సులోచన, వనజ, నిర్మల, రజిత, రమ, ఫాతిమా, గౌరీ, విహిత, కవిత, విజయ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

అక్కంపేట,నాగయ్యపల్లిలో బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటా ప్రచారం

పెంచికలపేట సొసైటీ భవనానికి భూమి పూజ

Jaibharath News

రైతు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. టేస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు