భాగ్యనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://tstet.cgg.gov.in వైబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు ఐడీ, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సెప్టెంబరు 27న ఫలితాలు విడుదల కానున్నాయి. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ 040-23120340, 040-23120433 నంబర్లను సంప్రదించవచ్చు.
previous post
next post