Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి*- రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్

జై భారత్ వాయిస్ నర్సంపేట: రాష్ట్రంలోని ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం నర్సంపేట పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన గిరిజన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ పత్రికల్లో పనిచేస్తున్న గిరిజన జర్నలిస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇళ్లు , ఇళ్ళ స్థలాలు మంజూరు చేసేలా మనమందరం కలిసి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా టీడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షుడు వెంకన్న నాయక్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హుస్సేన్ నాయక్, రాష్ట్ర కమిటీ మెంబర్ ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం వరంగల్ జిల్లా నూతన కమిటీని వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా  దేవరాజు ఏకాంబరం , జిల్లా అధ్యక్షుడిగా జాటోత్ యాకూబ్,
ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ నర్సింహ,
సహయ కార్యదర్శిగా గుగులోత్ రాము,
కార్యవర్గ సభ్యులుగా జాటోత్ అనిల్ నాయక్, బానోత్ జీవన్ నాయక్ ,  గుగులోత్ అమృ నాయక్ , బానోత్ రాము నాయక్, బానోత్ వెంకన్న నాయక్, గుగులోత్ అభిరామ్, పల్లకొండ కుమారస్వామిలను
ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన జర్నలిస్ట్ లు , తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎంపిపి సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

Jaibharath News

Jaibharathvoice నర్సంపేటలో అక్రమ అరెస్టులు

Sambasivarao

వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలోని ఐదు అసంబ్లీ సెగ్మెంట్ల ఇవియంల రెండవ రాండమైజేషన్ పూర్తి: రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.