Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

జై భారత్ వాయిస్ దామెర
గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రామ సుఖ్యతను తెలుపుతూ మండలంలోని కోగిల్వాయిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం దామెర మ మండలం కోగిల్వాయిలో నిర్వహించిన పోషణ ప్రతిజ్ఞలో ముఖ్య అతిథిగా గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర హాజయ్యారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు అందుబాటులో ఉన్న పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ జ్యోతి, గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని

చిన్న సన్న కారు రైతులకే భరోసా పథకాన్ని వర్తింప చేయాలి

Ashok

గంజాయి రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్