Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పేద లు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి

పేదలు గృహ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలి.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
పేదలు గృహలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలనిఆత్మకూర్ మండలం వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్ ఆత్మకూరు మండలం అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి లు అన్నారు. వారు
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహలక్ష్మి పథకం రాష్ట్రంలోనే తొలిసారి ఆత్మకూరు మండలంలో ఆదివారం భూమి పూజ చేసి ఒకే రోజు 22 మంది శంకుస్థాపన చేశారు.
సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కలను సహకారం చేసుకోవడం కొరకు నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం క్రింద నూతన గృహాలను మంజూరు చేస్తామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు .చిల్లి గవ్వ ఖర్చు లేకుండారాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు లబ్ధిదారునికి అందజేస్తున్నారు. మూడు విడుతలుగా 3 లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో జమ అవుతాయని నూతనంగా నిర్మించుకునే లబ్ధిదారునికి ఈ పథకం ఒక వరం లాంటిది. నిరుపేదలందరూ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలని …. మన అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి గృహ లక్ష్మీ పథకం మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ అధికారులు కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఎవరు అధైర్య పడవలసిన పనిలేదన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పాపని రవీందర్, వార్డ్ మెంబర్ రేవూరి ప్రవీణ్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్, ఏ ఎం సీ డైరెక్టర్ డా:పైడి, ఆప్షన్ నెంబర్ ఎండి అంకుస్ ,పొగాకుల సంతోష్ గౌడ్ ,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పదవులు లేకున్నా సమాజ సేవకు అంకితం కావాలి – పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Sambasivarao

యువత క్రీడల్లో రాణించాలి- సో సైటి చైర్మన్ రవీందర్

Jaibharath News

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News