ఉత్తమ అవార్డు అందుకున్న ఆత్మకూర్ మేజర్ గ్రామపంచాయతీ
సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
– జిల్లాకే ఆదర్శంగా నిలిచిన ఆత్మకూరు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి ఆదర్శంగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు చేసిన అభివృద్దికి జిల్లా ఉత్తమ అవార్డు దక్కింది.. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 అవార్డుల కార్యక్రమంలో ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీకి జిల్లా ఉత్తమ అవార్డును సర్పంచు పర్వతగిరి రాజు కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్,జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ చేతుల మీదుగా అందుకున్నారు. వారు ఉత్తమ అవార్డును అందించి సన్మానించారు. ప్రశంసా పత్రాన్ని అందించి సర్పంచ్ పర్వతగిరి రాజు పై ప్రశంసల జల్లును కురిపించారు. ఇప్పటివరకు మేజర్ గ్రామపంచాయతీ ఆత్మకూరు ఉత్తమ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మరింత అభివృద్ధి చేయాలని వారు అన్నారు . యువకులతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ఉన్నతాధికారులు సర్పంచ్ రాజును ప్రశంసించారు.అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరిని అధికారులు అభినందించారు.
ఈ అవార్డుల కార్యక్రమంలో డిపిఓ జగదీశ్వర్,డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్రావు,డిఆర్డిఓ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,ఎంపీఓ చేతన్ రెడ్డి, ఏపీవో రాజిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.